ఆలయాల్లో డిజిటల్ సేవలు.. 100 కియోస్క్‌ల ఏర్పాటు
ఆంధ్ర ప్రదేశ్ : రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో డిజిటల్ సేవలను పెంచాలని దేవదాయ శాఖ నిర్ణయించింది. దర్శనం, సేవల టికెట్లను సులభంగా పొందేలా 100 కియోస్క్‌లను ఏర్పాటుచేయనుంది. దీనివల్ల కౌంటర్ల వద్ద రద్దీ తగ్గనుంది. సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, ఇంద్రకీలాద్రి, శ్రీశైలం, కాణిపాకం, శ్రీకాళహస్తితోపాటు అరసవిల్లి, మహానంది, కసాపురం, కదిరి లక్ష్మీనరసింహస్వామి తదితర 15 ఆలయాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు.









Comments