గోరువెచ్చని నీరు తాగితే
ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగడం వల్ల శరీరంలో జీవక్రియలు ఉత్తేజితమవుతాయి. రక్తప్రసరణ సజావుగా జరుగుతుంది. కండరాల నొప్పులు తగ్గుతాయి. నరాల పనితీరు మెరుగుపడుతుంది. మెదడు చురుకుగా పని చేస్తుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
జీర్ణక్రియ వేగవంతమవుతుంది. అజీర్ణం, కడుపులో ఆమ్లత్వం, కడుపు ఉబ్బరం లాంటివి తగ్గుతాయి.
రాత్రిపూట శరీరంలో పేరుకున్న వ్యర్థ పదార్థాలన్నీ పూర్తిగా విసర్జితమవుతాయి. పేగులు, మూత్రపిండాలు, జననేంద్రియాలు పరిశుభ్రమవుతాయి.
వేడి నీరు తాగడం వల్ల గొంతులో చేరిన శ్లేష్మం తొలగిపోతుంది. గొంతులో గర గర, ముక్కు దిబ్బడ, జలుబు లాంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
శరీరంలో పేరుకుపోయిన కొవ్వులు కరుగుతాయి. దీంతో బరువు తగ్గి శరీరం సరైన ఆకృతిని సంతరించుకుంటుంది.
నెలసరి సమయంలో వేడి నీరు తాగడం వల్ల కడుపునొప్పి, అలసట, నీరసం, విసుగు లాంటి సమస్యలు తగ్గుతాయి.
నిద్రలేమితో బాధపడేవారు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగితే ఒత్తిడి తగ్గి సమస్య తీరుతుంది.
Comments