నా ఈవెంట్ నాదే టైటిల్
బెంగళూరు: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. తన పేరిటే నిర్వహించిన ఆరంభ ఎన్‌సీ క్లాసిక్ (నీరజ్ చోప్రా క్లాసిక్) ఈవెంట్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఈవెంట్ నిర్వహణతోపాటు అథ్లెట్‌గా బరిలోకి దిగి విజేతగా నిలవాలన్న కలను నెరవేర్చుకొన్నాడు. శనివారం జరిగిన పోటీల్లో మూడో ప్రయత్నంలో జావెలిన్‌ను 86.18 మీటర్ల దూరం విసిరిన నీరజ్ టాప్‌లో నిలిచాడు. దోహాలో డైమండ్ లీగ్, గోల్డ్ స్పైక్ గెలిచిన చోప్రాకు ఇది వరుసగా మూడో టైటిల్. 2015 వరల్డ్ చాంపియన్ జూలియన్ ఇగో (కెన్యా-84.51 మీ.) రెండో స్థానంలో, రుమేష్ పతిరేజ్ (శ్రీలంక-84.34 మీ.) 84.34 మీ. మూడో స్థానంలో నిలిచారు. జేఎ్‌సడబ్ల్యూ స్పోర్ట్స్, భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఎఎ్‌ఫఐ) భాగస్వామ్యంతో చోప్రా ఈ ఈవెంట్‌ను నిర్వహించాడు. కిక్కిరిసిన స్టేడియంలో చోప్రా కుటుంబం కూడా అతడి ప్రదర్శనను వీక్షించింది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఫౌల్‌తో ఆరంభించిన నీరజ్.. రెండో ప్రయత్నంలో 82.99 మీ. అందుకున్నాడు. నాలుగో ప్రయత్నంలో ఫౌల్ కాగా.. ఐదో త్రోలో 84.07 మీ., ఆరో త్రోలో 82.22 మీ. మాత్రమే విసిరాడు.
Comments