పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..
గత నెలలో 93 వేల రూపాయల దగ్గర ట్రేడ్ అయిన స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర ఇప్పుడు మళ్లీ లక్ష దగ్గరకు చేరుకుంది. 18, 22 క్యారెట్ల బంగారం ధరలు కూడా మళ్లీ షాకులు మీద షాకులు ఇస్తున్నాయి. ప్రతీ రోజూ పెరుగుతూ పోతున్నాయి. ఈ సారి మాత్రం 24 క్యారెట్ల బంగారం లక్ష దాటే అవకాశం కనిపిస్తోంది.
హైదరాబాద్‌లో బంగారం ధరలు ఇలా..
హైదరాబాద్ మహా నగరంలో నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 91,050 రూపాయల దగ్గర..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 99,330 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 74,500 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. నిన్నటితో పోల్చుకుంటే పది గ్రాముల బంగారంపై.. గ్రాముకు ఒక రూపాయి చొప్పున 10 రూపాయలు పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 99,340 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 91,060 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర .. 74,510 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.
వెండి ధరలు ఇలా ..
బంగారం ధరలతో సంబంధం లేకుండా వెండి ధరలు మొన్నటి వరకు తగ్గుతూ వచ్చాయి. కానీ, ఈ రోజు వెండి ధరలు కూడా అనుకోని షాక్ ఇచ్చాయి. నిన్న హైదరాబాద్ నగరంలో 100 గ్రాముల వెండి ధర 12,100 దగ్గర ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర 1,21,000 దగ్గర ట్రేడ్ అయింది. ఈ రోజు 100 గ్రాముల వెండిపై 10 రూపాయలు, కేజీ వెండిపై 100 రూపాయలు పెరిగింది. 100 గ్రాముల వెండి ధర నేడు 12,110 దగ్గర ట్రేడ్ అవుతోంది. కేజీ వెండి ధర 1,21,100 దగ్గర ట్రేడ్ అవుతోంది.
Comments