హెచ్‌ఎంఏ ప్రెసిడెంట్‌గా దేవేందర్ రెడ్డి
హైదరాబాద్ : హైదరాబాద్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (హెచ్‌ఎంఏ) 2025-26 ఆర్థిక సంవత్సరానికి కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకుంది. ఇటీవల జరిగిన మేనేజ్‌మెంట్ కమిటీ సమావేశంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్త, ఈరైడ్ ఈ-మొబిలిటీ సంస్థ వ్యవస్థాపకులు అల్వాల దేవేందర్ రెడ్డి హెచ్‌ఎంఏ కొత్త ప్రెసిడెంట్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇదే సమావేశంలో శరత్ చంద్ర మారోజు వైస్ ప్రెసిడెంట్‌గా, వాసుదేవన్ సెక్రటరీగా ఎన్నికైనట్టు హెచ్‌ఎంఏ తెలిపింది.
Comments