10 వేల గూడ్స్ లారీలను నిలిపివేస్తాం: యజమానుల సంఘం
ఆంధ్ర ప్రదేశ్ : ఎల్లుండి (డిసెంబర్ 9) అర్ధరాత్రి నుంచి గూడ్స్ రవాణా నిలిపివేయాలని లారీ ఓనర్ల సంఘం నిర్ణయించింది. 13 ఏళ్లు దాటిన గూడ్స్ వాహనాలపై కేంద్రం పెంచిన టెస్టింగ్, ఫిట్‌నెస్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేసింది. అదనపు ఫీజుల భారం సరుకు రవాణా రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంది. డిమాండ్లను పట్టించుకోకపోతే రైల్వే షెడ్లు, షిప్‌యార్డుల్లో 10 వేల గూడ్స్ లారీలను నిలిపివేస్తామని హెచ్చరించింది.










Comments