2027 ఫిబ్రవరిలో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో
న్యూఢిల్లీ: భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో (బీఏంజీఈ).. తదుపరి ఎడిషన్‌ను 2027, ఫిబ్రవరి 4 నుంచి 9 వరకు ఢిల్లీలో నిర్వహించనున్నట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. ఇప్పటికే 2024, 2025 (జనవరి)లో జరిగిన రెండు ఎడిషన్స్‌కు విశేష స్పందన లభించగా.. ఈ మూడో ఎడిషన్‌లో ఎక్స్‌పో పరిధిని మరింత విస్తరించేందుకు కొత్త విభాగాలను చేర్చనున్నట్లు వెల్లడించింది. వీటిలో మల్టీ మోడల్ మొబిలిటీ, లాజిస్టిక్స్‌తో పాటు వ్యవసాయ ఆధారిత మొబిలిటీ పరిష్కారాలపై ప్రత్యేక ప్రదర్శనలు ఉంటాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
Comments