గ్లోబల్ సమ్మిట్‌కు బీజేపీ మద్దతు
TG: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న ప్రతిష్ఠాత్మక గ్లోబల్ సమ్మిట్‌కు మద్దతిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్‌చందర్‌రావు వెల్లడించారు. ‘కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ లక్ష్యంగా అన్ని రాష్ట్రాల అభివృద్ధికి సహకరిస్తోంది. తెలంగాణకు కూడా పూర్తి అండగా ఉంటుంది. ఈ సదస్సుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరవుతారు. సమ్మిట్ విజయవంతమై రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం’ అని తెలిపారు.








Comments