తల్లిపై కూతురు పోటీ.. విషాదాంతం
తెలంగాణ : రాజకీయాలు కుటుంబ సంబంధాలనూ విచ్ఛిన్నం చేస్తున్నాయి. నల్గొండ(D) ఏపూరులో తల్లీకూతురు మధ్య నెలకొన్న రాజకీయ వివాదం విషాదాంతమైంది. 3వ వార్డు అభ్యర్థులుగా తల్లి లక్ష్మమ్మను బీఆర్ఎస్, ఆమె కూతురు అశ్వినిని కాంగ్రెస్ బలపరిచింది. ఈ క్రమంలో కూతురు నామినేషన్ ఉపసంహరించుకున్నప్పటికీ ఫ్యామిలీ గొడవలు తారస్థాయికి చేరాయి. దీంతో లక్ష్మమ్మ ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.










Comments