‘నీ భర్త అంకుల్లా ఉన్నాడు’ అని కామెంట్.. భార్య ఏం చేసిందంటే?
ఉత్తరప్రదేశ్ మీరట్‌కు చెందిన అంజలి ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. అంజలి, తన భర్త రాహుల్‌తో కలిసి ఇన్‌స్టా రీల్స్ చేసేది. ‘నువ్వు అందంగా ఉన్నావ్. నీ భర్తే అంకుల్లా ఉన్నాడు’ అని కామెంట్ రావడంతో అంజలి సహించలేకపోయింది. అదే గ్రామానికి చెందిన అజయ్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలియగానే ప్రియుడితో కలిసి అతడిని తుపాకీతో కాల్చి చంపింది. పోలీసులు అంజలి, అజయ్‌ను అరెస్టు చేశారు.









Comments