ఫిర్యాదులకు సత్వర పరిష్కారం: కమిషనర్ విశ్వనాథ్
కర్నూలు: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు వచ్చే అర్జీలకు సత్వరమే పరిష్కారం చూపాలని మున్సిపల్ కమిషనర్ పి.విశ్వనాథ్ ఆదేశించారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ విభాగాల నుండి 28 అర్జీలు వచ్చాయి. వీటిని చట్టపరిధిలో పరిష్కరిస్తామన్నారు. టిడ్కో లబ్ధిదారులు పూర్తి డిడి చెల్లించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఆర్‌జివి కృష్ణ, డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, మేనేజర్ చిన్నరాముడు తదితరులు పాల్గొన్నారు.









Comments