వైసీపీ ‘కోటి సంతకాలు’లో మార్పులు: సజ్జల
ఆంధ్ర ప్రదేశ్ : మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమంలో స్వల్ప మార్పులు చేసినట్లు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ‘రాష్ట్రపతి పర్యటన వల్ల 16న గవర్నర్ షెడ్యూల్ మారింది. ఆరోజుకు బదులు 17న పార్టీ చీఫ్ జగన్, నేతలు గవర్నర్‌ను కలుస్తారు. ఇక జిల్లాస్థాయి ర్యాలీలు 13కు బదులు 15న జరిపి అక్కడి నుంచి బయలుదేరాలి. నియోజకవర్గాల్లో నిర్ణీత 10న కార్యక్రమాలు నిర్వహించాలి’ అని చెప్పారు.








Comments