• Dec 09, 2025
  • NPN Log

    భారత మాజీ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్  తన అధికారిక 'ఎక్స్' ఖాతాలో బాలీవుడ్ నటి సన్నీ లియోన్ ఫొటోను పోస్ట్ చేశాడు. దీంతో అశ్విన్ సన్నీ లియోన్ ఫొటో షేర్ చేయడం ఏంటా అని ఆయన అభిమానులతో పాటు అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ మాజీ ఆల్ రౌండర్ రెండు చిత్రాల కోల్లెజ్‌ను పంచుకున్నాడు. అందులో ఒక వైపు సన్నీ లియోన్ చిత్రం, మరొక వైపు చెన్నై సాధు వీధి ఫొటోను పక్కపక్కన పెట్టి.. షేర్ చేశాడు. అయితే అశ్విన్ పోస్ట్ కొంతమంది అభిమానులను తలలు పట్టుకున్నారు. అయితే కొంతమంది మాత్రం అశ్విన్ చేసిన పోస్ట్ ను డీకోడ్ చేసి.. ఆ ఫోటోల అర్ధాన్ని తెలిపారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం...

    దేశవాళీ టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ-2025లో భాగంగా తమిళనాడు జట్టు సోమవారం సౌరాష్ట్ర తో తలపడింది. నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఆ మ్యాచ్ లో టాస్‌ గెలిచిన సౌరాష్ట్ర తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. సౌరాష్ట్ర బ్యాటర్లలో విశ్వరాజ్‌ జడేజా(70), సమ్మార్‌ గజ్జార్‌ (66) చెలరేగి ఆడారు. తమిళనాడు బౌలర్లలో సీలం బరాసన్‌ మూడు వికెట్లు సాధించాడు. అలానే ఇసక్కిముత్తు రెండు వికెట్లు తీశాడు. ఆర్‌. రాజ్‌కుమార్‌, సన్నీ సంధు చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

    ఇక 184 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన తమిళనాడు18.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి.. లక్ష్యాన్ని అందుకుంది. ఓపెనర్‌, టీమిండియా స్టార్‌ సాయి సుదర్శన్‌ మెరుపు శతకం (55 బంతుల్లో 101 నాటౌట్‌)తో చెలరేగాడు. మరోవైపు.. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన సన్నీ సంధు (Sunny Sandhu) కేవలం తొమ్మిది బంతుల్లోనే 30 పరుగులతో సౌరాష్ట్ర బౌలర్లపై విరుచుకుపడ్డాడు. సాయి సుదర్శన్ సన్న సంధుల అద్భుత ప్రదర్శనతో సౌరాష్ట్రపై తమిళనాడు మూడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.

    అశ్విన్ పెట్టిన పోస్ట్ అర్థం ఏంటంటే..

    తమిళనాడు, సౌరాష్ట్ర మ్యాచ్ అనంతరం టీమిండియా ఆల్ రౌండర్ అశ్విన్.. నటి సన్నీ లియోన్‌(Sunny Leone) ఫోటోకు చెన్నైలోని సంధు స్ట్రీట్‌ ఫోటోను జతచేసి షేర్‌ చేశాడు. సన్నీ సంధును ప్రశంసించే క్రమంలోనే అశ్విన్ ఈ మేరకు పోస్ట్‌ పెట్టాడని, దీనిని తాము సులభంగానే డీకోడ్‌ చేశామంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా అశ్విన్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement