• Dec 09, 2025
  • NPN Log

    ఇటీవల జరుగుతున్న సైబర్ నేరాల దృష్టిలో ఉంచుకొని భూపాలపల్లి జిల్లా ఎస్పీ సంకీర్త్ ఎలాగైనా ఇట్టి నేరాలను ఆపాలని ఉద్దేశంతో తీసుకున్న ఆలోచన ప్రకారం తీసుకువచ్చిన సైబర్ సారథి @ 1930 ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ అన్న ప్రోగ్రాం తో అవగాహన కల్పించాలని సోమవారం రాత్రి భూపాలపల్లి డి.ఎస్.పి సంపత్ రావు మొగుళ్లపల్లి మండలంలోని ఇస్సిపేట గ్రామ ప్రజలకు సైబర్ నేరాలపై  అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి డి.ఎస్.పి సంపత్ రావు పాల్గొని,మాట్లాడుతూ ప్రజలకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింకులు లేదా మెసేజ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చిట్యాల సిఐ మల్లేష్, మొగుళ్ళపల్లి ఎస్ ఐ అశోక్,  పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement