హోంగార్డుల సేవలు ప్రశంసనీయం: ఎస్పీ విక్రాంత్ పాటిల్
కర్నూలు (క్రైం): శాంతిభద్రతల పరిరక్షణలో హోంగార్డుల సేవలు వెలకట్టలేనివని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. శనివారం జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో 63వ హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ గౌరవ వందనం స్వీకరించి మాట్లాడారు. పోలీసులతో సమానంగా హోంగార్డులు విధులు నిర్వర్తిస్తున్నారని, వారి సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
అనంతరం క్రీడా పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. నలుగురు రిటైర్డ్ హోంగార్డులను సన్మానించి, ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు హుస్సేన్ పీరా, కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.









Comments