హరియాణాలో బీజేపీ ఓట్ల చోరీ: షర్మిల
అమరావతి : హరియాణాలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్పడిన ఓట్ల చోరీపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హైఓల్టేజీ హైడ్రోజన్ బాంబు పేల్చారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. గురువారం విజయవాడ ఆంధ్రరత్న భవన్‌లో పీసీసీ సీనియర్ నేతలు జేడీ శీలం, మస్తాన్ వలి, నరహరిశెట్టి నరసింహారావు తదితరులతో కలసి ఆమె మీడియాతో మాట్లాడారు. ‘హరియాణాలో 25 లక్షల దొంగ ఓట్లను సృష్టించి బీజేపీ ఓట్ల చొరీకి పాల్పడింది. దీనిని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 17.65 లక్షల సంతకాలను సేకరించి ఢిల్లీకి పంపుతున్నాం’ అని తెలిపారు.
ఇవేమి వ్యాఖ్యలు షర్మిలా: బీజేపీ
షర్మిల ‘దొంగ ఓట్ల’ వ్యాఖ్యలు దేశ ప్రజాస్వామ్యాన్ని అవమాన పరిచేలా ఉన్నాయని బీజేపీ మండిపడింది. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు భారత ఎన్నికల సంఘం మూల స్తంభం. దానిపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న చెత్త ఆరోపణలు, అబద్ధాలు ప్రజాస్వామ్యానికే ప్రమాదమని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికారిక ప్రతినిధి వల్లూరు జయప్రకాశ్ నారాయణ వ్యాఖ్యానించారు.










Comments