• May 30, 2026
  • NPN Log

    పారిస్‌: రికార్డు స్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్‌ సాధించాలన్న జొకోవిచ్‌కు మరోసారి నిరాశ తప్పలేదు. శుక్రవారం జరిగిన ఫ్రెంచ్‌ ఓపెన్‌ సింగిల్స్‌ మూడో రౌండ్‌లో బ్రెజిల్‌కు చెందిన 19 ఏల్ల జొవో ఫోన్సెకా ఐదు సెట్ల హోరాహోరీ పోరులో 4-6, 4-6, 6-3, 7-5, 7-5తో జొకోవిచ్‌కు షాకిచ్చాడు. మహిళల సింగిల్స్‌ మూడోరౌండ్లో మూడో సీడ్‌ స్వియటెక్‌ (పోలెండ్‌) 6-4, 6-4తో లినెట్టిపై గెలిచింది. మిగతా స్టార్లలో స్విటోలినా, ఆండ్రీవా నాలుగో రౌండ్‌ చేరారు. స్విట్జర్లాండ్‌కు చెందిన జిల్‌ టీక్‌మన్‌ 6-1, 7-5తో 10వ సీడ్‌ మ్యుచోవా (చెక్‌ రిపబ్లిక్‌)ను చిత్తుచేసింది. పురుషుల మూడో రౌండ్‌లో 11వ సీడ్‌ రుబ్లేవ్‌ (రష్యా) 7-5, 7-6 (2), 7-6 (2)తో బోర్గె్‌సపై నెగ్గి ప్రీక్వార్టర్స్‌ల్లో అడుగుపెట్టాడు. పురుషుల డబుల్స్‌లో యుకీ భాంబ్రీ/మైకేల్‌ ఓడగా, శ్రీరామ్‌ బాలాజీ జోడీ మూడోరౌండ్‌ చేరింది.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement