• May 30, 2026
  • NPN Log

    పరిగి, న్యూస్‌టుడే:

    శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండల కేంద్రంలోని మేజర్ పంచాయతీ పరిధిలో కొలువైన పురాతన పన్నాడమ్మ అమ్మవారి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. దాదాపు 600 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ ఆలయంలో నిర్వహించిన జ్యోతుల మహోత్సవ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

    ​ఈ వేడుకల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ సాంప్రదాయం ప్రకారం భక్తిశ్రద్ధలతో జ్యోతిని నెత్తిన మోసి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. నియోజకవర్గ ప్రజలంతా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, మండలంలో పాడిపంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఆమె పేర్కొన్నారు.

    ​ఈ కార్యక్రమంలో పరిగి మండల వైకాపా నాయకులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు మరియు స్థానిక భక్తులు పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేశారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement