ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్తో గవర్నర్ భేటీ
న్యూఢిల్లీ : ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్తో రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ భేటీ అయ్యారు. శుక్రవారం ఉద యం ఉప రాష్ట్రపతి నివాసంలో ఆయనతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఉపరాష్ట్రపతిని శాలువాతో సత్కరించి, శ్రీవెంకటేశ్వరుని ప్రతిమని గవర్నర్ అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రాభివృద్ధిపై ఇరువురు కొద్దిసేపు చర్చించుకున్నారు.






Comments