• May 30, 2026
  • NPN Log

    ప్రస్తుతం ఏ సినిమా ఇండస్ట్రీలోనైనా వైవిధ్యభరితమైన చిత్రాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. అలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్, కంటెంట్‌తో నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి తన మెమరీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తోన్న చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’. ఒక బ్యాగ్ చుట్టూ తిరిగే ఈ మూవీకి రవి కుమార్ సీరపు కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బదల్, భార్గవి తదితరులు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు.. సినిమా గురించి మాట్లాడుకునేలా చేశాయి. రీసెంట్‌గా రాశీ   పాత్రకు సంబంధించిన పోస్టర్ సినిమాపై మరింతగా ఆసక్తిని క్రియేట్ చేసింది. తాజాగా ఈ మూవీ హీరోయిన్ లుక్‌ని మేకర్స్ పరిచయం చేశారు.

    హీరోయిన్ రాధ్య  ఫస్ట్ లుక్ పోస్టర్‌ను వదిలిన మేకర్స్.. ఈ పోస్టర్‌తోనే ఆమె పాత్ర తీరుతెన్నులు ఎలా ఉండబోతున్నాయో క్లారిటీ ఇచ్చేశారు. ఇందులో ఆమెను చూపించిన తీరు, గన్ను పట్టుకున్న విధానం, చేతిలో ఉన్న ఆ వస్తువు.. ఇలా అన్నీ కూడా బాగా హైలెట్ అవుతున్నాయి. పవర్ ఫుల్ లుక్‌లో ఆమెని ప్రజంట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ బాగా వైరల్ అవుతోంది. ఇదే అప్డేట్‌లో ఈ చిత్రాన్ని త్వరలోనే రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా మేకర్స్ తెలిపారు. తొలి సినిమానే అయినప్పటికీ, నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీ టీజర్‌ని రిలీజ్ చేస్తామని, టీజర్‌తో అందరికీ ఈ సినిమాపై ఓ క్లారిటీ వస్తుందని నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి తెలిపారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement