పోలవరం నిర్వాసితులకు నేడు వెయ్యి కోట్ల పరిహారం
అమరావతి : పోలవరం నిర్వాసితులకు శుభవార్త. సహాయ పునరావాసం కింద రాష్ట్రప్రభుత్వం మరో రూ.వెయ్యి కోట్లను వారికి చెల్లించనుంది. మంత్రి నిమ్మల రామానాయుడు శనివారం ఏలూరు జిల్లా వేలేరుపాడులో వారికి చెక్కులు పంపిణీ చేయనున్నారు. కేంద్రం ఆదేశాలతో పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్రప్రభుత్వం ప్రత్యేకంగా తెరచిన ఖాతా నుంచి సొమ్ము వారి అకౌంట్లకు చేరుతుంది. ఖాతాల్లో జమయినవెంటనే లబ్ధిదారు ఫోన్కు మెసేజ్ వస్తుంది. నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం సహాయ పునరావాసం కింద పరిహారం చెల్లించడం ఇది రెండోసారి. ఈ ఏడాది జనవరిలో రూ.900 కోట్లను వారి ఖాతాల్లో జమచేసింది. ఫోన్లలో వచ్చిన మెసేజ్లు చేసి వారు ఆనందంతో సంబరాలు చేసుకున్నారు. ఇప్పుడీ చెల్లింపుల కార్యక్రమాన్ని బహిరంగంగా నిర్వహించి వారి ఆనందంలో పాలుపంచుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతకుముందు 2016లోనూ చంద్రబాబు సర్కారే పరిహారం చెల్లించింది. జగన్ తన ఐదేళ్ల హయాంలో పైసా కూడా ఇవ్వలేదు. పైగా పోలవరం ప్రాంతంలో ముఖ్యమంత్రి హోదాలో పర్యటించినప్పుడు నిర్వాసితులు పరిహారర చెల్లించాలని కోరితే.. అది తన చేతుల్లో లేదని.. కేంద్రం నిధులిస్తేనే ఇస్తానని ఆయన తెగేసి చెప్పారు.







Comments