వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం.
ఉరవకొండ మండలం ఆమిద్యాల గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో వాల్మీకి మహర్షి స్వామి వారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి మరియు ఉరవకొండ శాసనసభ్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారు ముఖ్య అతిధిగా పాల్గొని స్వామి వారి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ముందుగా ఆమిద్యాల గ్రామం చేరుకున్న మంత్రివర్యులకు గ్రామ ప్రజలు, కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో అనంతపురం పార్లమెంట్ సభ్యులు శ్రీ అంబికా లక్ష్మీనారాయణ గారు, రాయదుర్గం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ శ్రీ కాలవ శ్రీనివాసులు గారు మరియు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.అనంతరం గ్రామస్థులను ఉద్దేశించి మంత్రివర్యులు ప్రసంగించారు







Comments