ఇకపై ‘మనమిత్ర’లోనే ఆర్జిత సేవా టికెట్లు
ఆంధ్ర ప్రదేశ్ : విజయవాడ కనకదుర్గమ్మ భక్తులకు దేవస్థానం శుభవార్త చెప్పింది. ఇకపై దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలోని అన్ని ఆర్జిత సేవల టికెట్లు మనమిత్ర వాట్సాప్ నంబర్ ద్వారానే లభ్యమవుతాయని అధికారులు తెలిపారు. కౌంటర్ల వద్ద టికెట్ల విక్రయం పూర్తిగా నిలిపివేయనున్నట్లు స్పష్టం చేశారు. ప్రత్యక్ష, పరోక్ష సేవల టికెట్లను 9552300009 వాట్సాప్ నంబర్ ద్వారా బుక్ చేసుకోవచ్చని, దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు.









Comments