ఎరాస్మస్ బౌలింగ్ కరెక్టేనా?
T20 వరల్డ్ కప్ లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ విచిత్రమైన బౌలింగ్‌పై చర్చ మొదలైంది. ఇది గల్లీ త్రో బౌలింగ్‌లా ఉందని పలువురు విమర్శిస్తున్నారు. పాక్ బౌలర్ ఉస్మాన్ తారిఖ్‌ను అనుసరిస్తున్నారేమోనని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ICC 15 డిగ్రీల రూల్‌కు లోబడే అతని బౌలింగ్ ఉందని, మోచేయిని వంచడం లేదని మరికొందరు చెబుతున్నారు. ఏదిఏమైనా అతను(4W) భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు.










Comments