• Mar 12, 2026
  • NPN Log

    తిరుమల: తిరుమలలో అరుదైన పచ్చ నాగుపాము కనిపించింది. సాధారణంగా నాగుపాములు బూడిద రంగులో ఉంటాయి. అయితే తిరుమల లో మాత్రం బుధవారం సాయంత్రం పచ్చ రంగులో ఉన్న నాగుపాము ప్రత్యక్షమై అందరినీ అశ్చర్యపరిచింది. రెండడుగుల పొడవు మాత్రమే ఉన్న ఈ పాము సాధారణ నాగుపాముల తరహాలోనే పడగతో కనిపించగా అక్కడి సిబ్బంది పాములు పట్టే టీటీడీ కాంట్రాక్ట్‌ ఉద్యోగి భాస్కరనాయుడికి సమాచారమిచ్చారు.


    వెంటనే ఆయన అక్కడికి చేరుకుని పామును పట్టుకుని దట్టమైన అడవిలో విడిచిపెట్టాడు. ఈ అరుదైన పాము నాగుపాము జాతికి సంబంధించినదేనని, అత్యంత విషపూరితమైనదని భాస్కర నాయుడు తెలిపారు.


     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement