నేటి నుంచి పశువులకు ఫ్రీగా ‘గాలికుంటు’ టీకాలు
ఆంధ్ర ప్రదేశ్ : రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి ఏప్రిల్ 29 వరకు పశువులకు ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను ప్రభుత్వం వేయనుంది. ఇందుకోసం 83.70 లక్షల టీకాలను పంపిణీ చేసింది. వెటర్నరీ డాక్టర్లు పాడి రైతుల ఇళ్ల వద్దకే వెళ్లి ఆవులు, గేదెలు, దూడలు, మేకలు, గొర్రెలకు ఈ టీకాలను వేస్తారు. కాలి గెట్టల మధ్య, నోట్లో పుండ్లు, జ్వరం ఈ వ్యాధి లక్షణాలు. సకాలంలో టీకాలు వేయకపోతే పశువులు మరణిస్తాయి.









Comments