10 నిమిషాల్లో 40 కోట్ల సైబర్ దాడులు!
ఆపరేషన్ సిందూర్ సమయంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(NSE) వెబ్‌సైట్‌పై పెద్ద ఎత్తున సైబర్ దాడులు జరిగినట్లు సంస్థ సీఈవో ఆశిశ్ కుమార్ చౌహాన్ తెలిపారు. కేవలం 10 నిమిషాల్లోనే 40 కోట్ల దాడులు చేశారని చెప్పారు. వెబ్‌సైట్‌ను షట్‌డౌన్ చేయించేందుకు హ్యాకర్లు ప్రయత్నించారని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ పై సగటున రోజుకు 20 కోట్ల సైబర్ దాడులు జరుగుతున్నాయని, వాటిని సమర్థంగా అడ్డుకుంటున్నామని పేర్కొన్నారు.










Comments