ఆగస్టు 21న నాని ‘ప్యారడైజ్’ విడుదల
నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తోన్న ‘ప్యారడైజ్’ చిత్రం విడుదల వాయిదా పడింది. మార్చి 26న రావాల్సిన ఈ మూవీని ఆగస్టు 21న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘నేను తొందరపడాలి అనుకోవట్లేదు. దీనికి నాకు కొంత సమయం కావాలి. 21-08-2026న ప్యారడైజ్ వస్తుంది’ అని పేర్కొంటూ శ్రీకాంత్ ఓ పోస్టర్‌ను షేర్ చేశారు. మోహన్ బాబు విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు.










Comments