ఎయిర్టెల్ చీపెస్ట్ ప్లాన్ అదుర్స్.. ఒక్క రీఛార్జ్తో ఏడాదంతా ఫుల్ ఎంజాయ్!
ఎయిర్టెల్ కస్టమర్లకు బంపర్ ప్లాన్.. ప్రస్తుతం ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం 365 రోజుల వ్యాలిడిటీతో అత్యంత చౌకైన ప్లాన్ అందుబాటులో ఉంది. మీరు జస్ట్ రూ. 1,849తో రీచార్జ్ చేస్తే చాలు.. ఏడాదంతా ఎంజాయ్ చేయొచ్చు. తక్కువ ధరలో లాంగ్ ప్లాన్ కోరుకునే వారికి ఈ ప్లాన్ బెటర్. కానీ, ఇందులో మీకు డేటా రాదు. అన్ లిమిటెడ్ కాలింగ్, SMS, అదనపు బెనిఫిట్స్ మాత్రం పొందవచ్చు. మీరు జియో కస్టమర్ అయితే కేవలం రూ. 1748కే ప్లాన్ అందుబాటులో ఉంది. వ్యాలిడిటీ పరంగా ఎయిర్ టెల్ కన్నా చాలా తక్కువగా ఉంది. ఎక్కువ వ్యాలిడిటీ కావాలంటే ఎయిర్టెల్ తీసుకోవడమే మంచిది.
ఎయిర్టెల్ రూ. 1849 ప్లాన్ :
ఎయిర్టెల్ కస్టమర్ల కోసం రూ. 1849 ప్లాన్ అందుబాటులో ఉంది. ఏ నెట్వర్క్కైనా అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 3600 SMS బెనిఫిట్స్ అందిస్తుంది. ఈ ప్లాన్లో డేటా బెనిఫిట్స్ లేకున్నా 12 నెలల వ్యాలిడిటీతో రూ. 4వేల విలువైన అడోబ్ ఎక్స్ప్రెస్ ప్రీమియంతో కొన్ని అదనపు బెనిఫిట్స్ పొందవచ్చు.
అలాగే, ఈ రీఛార్జ్ ప్లాన్ ప్రతి 30 రోజులకు ఒకసారి ఫ్రీ హలోట్యూన్ అందిస్తుంది. ఒకవేళ మీకు డేటా అక్కర్లేదంటే ఈ ప్లాన్ బెటర్. ఎందుకంటే.. ఈ ధరకు 365 రోజుల వ్యాలిడిటీతో మరే ఇతర ప్లాన్ అందుబాటులో లేదు.
జియో రూ. 1748 ప్లాన్ :
జియో ప్లాన్ ఎయిర్టెల్ ప్లాన్ కన్నా చాలా చౌకైనది. కానీ, ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీ కాకుండా 336 రోజుల వ్యాలిడిటీనే అందిస్తోంది. ఎయిర్టెల్ మాదిరిగా ఈ ప్లాన్ కూడా ప్రీపెయిడ్ యూజర్ల కోసం అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 3,600 SMS బెనిఫిట్స్ అందిస్తుంది.
ఈ ప్లాన్ జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్ స్టోరేజ్ అనే రెండు అదనపు బెనిఫిట్స్ కూడా అందిస్తుంది. ఈ రెండు ప్లాన్లలో ధర, లిమిట్, బెనిఫిట్స్ పరంగా చాలా డిఫరెన్స్ ఉంది. అందుకే మీ అవసరాన్ని బట్టి ప్లాన్ తీసుకోవడం బెటర్.










Comments