• Jun 25, 2026
  • NPN Log

    గుడివాడ : ‘గుడివాడ, కైకలూరులో భారీస్థాయిలో ఎగ్జిబిషన్‌లు ఏర్పాటు చేస్తున్నారు. రోజుకు 500 మందికి భోజనాలు, స్నాక్స్‌ కావాలి. ఈ ఆర్డర్‌ మీకే ఇప్పిస్తా. దీనిలో నాకు రావల్సిన కమీషన్‌ పంపించండి’ అంటూ సైబర్‌ మోసగాడు పలువురిని బురిడీ కొట్టించాడు. అతని వలలో పడి ఇద్దరు రూ.లక్ష వరకు మోసపోయారు. వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి 93980 53148 నంబర్‌ నుంచి తన పేరు శరత్‌కుమార్‌ అంటూ శుక్రవారం గుడివాడలోని ఇద్దరు ప్రముఖ క్యాటరర్స్‌కు ఫోన్‌ చేశాడు. ఫుడ్‌ కాంట్రాక్టులో బేరసారాలు అయ్యాక, వారి బ్యాంకు వివరాలు తీసుకున్నాడు. అడ్వాన్స్‌గా రూ.1.50 లక్షలు వేస్తానని, బ్యాంకులో ఉన్నానంటూ నగదు ఫొటోను వాళ్లకు పంపించాడు. జీఎ్‌సటీకట్‌ అవుతుందని, తనకు రావాల్సిన కమీషన్‌ వేస్తే వెంటనే నగదు ట్రాన్స్‌ఫర్‌ చేస్తానని నమ్మబలికాడు. దీంతో ఇద్దరు క్యాటరర్స్‌ రూ.40 వేలు, రూ.20 వేల చొప్పున శరత్‌కుమార్‌ చెప్పిన ఫోన్‌పే నంబర్లకు పంపించారు. శనివారం కూడా ఇదే తరహాలో సైబర్‌ నేరగాడు ప్రయత్నించగా గుడ్లవల్లేరు, కైకలూరుకు చెందిన ఇద్దరు క్యాటరర్స్‌ అతడి దోపిడీనుంచి త్రుటిలో తప్పించుకున్నారు. మరికొంతమందికూడా అతనికిడబ్బులుపంపినట్టు తెలిసింది.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement