ప్రతిష్ఠాత్మక అవార్డు గెలుచుకున్న ఉపాసన
రామ్ చరణ్ సతీమణి, అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్ ఉపాసన కొణిదెల తాజాగా ‘మోస్ట్ పవర్ ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్’ అవార్డ్ ను సొంతం చేసుకున్నారు. ఈ శుభవార్తను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారామె. ప్రస్తుతం తాను ప్రెగ్నెన్సీతో ఉన్నందువల్ల ఈ పురస్కారాన్ని తీసుకునేందుకు వెళ్లలేకపోయానని తెలిపారు. ఈ గుర్తింపు మరింత ఎక్కువగా పనిచేయడానికి, తమ పరిమితులను అధిగమించడానికి ప్రేరణనిస్తుందని పేర్కొన్నారు.










Comments