బంగ్లాను షేక్ చేస్తా.. గర్ల్‌ఫ్రెండ్‌తో హాదీ మర్డర్ నిందితుడు
ఉస్మాన్ హాదీ హత్యతో బంగ్లా భగ్గుమంటోంది. దీంతో పోలీసులు మర్డర్ నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు. ఫైజల్ అనే యువకుడిని ప్రధాన నిందితుడిగా గుర్తించారు. హాదీ హత్యకు ముందు అతడు తన గర్ల్‌ఫ్రెండ్‌తో ‘బంగ్లాను షేక్ చేస్తా’ అని చెప్పినట్లు తెలుస్తోంది. తర్వాత కొన్ని గంటలకే మరో ఇద్దరితో కలిసి అతడిపై కాల్పులు జరిపాడు. ఓ బుల్లెట్ హాదీ ఒక చెవి నుంచి దూరి మరో చెవిలో నుంచి బయటికి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.










Comments