భద్రాచలంలో 'బాలభీముడి' జననం..!
భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో వైద్యులు అరుదైన ప్రసవం చేశారు. వెంకటాపురం మండలం నూగూరుకు చెందిన సంధ్యారాణి గురువారం శస్త్రచికిత్స ద్వారా 5.20 కిలోల బరువున్న మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. విషయం తెలిసిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ఆసుపత్రికి చేరుకుని శిశువును ఆశీర్వదించి, క్లిష్టమైన ప్రసవాన్ని విజయవంతం చేసిన వైద్య బృందాన్ని అభినందించారు.










Comments