మోటోరోలా ఫోన్లపై మెగా డీల్! ఫ్లిప్‌కార్ట్‌లో ఇలా కొంటే రూ.15వేలకుపైగా తగ్గింపు..
మోటోరోలా అభిమానులకు అదిరిపోయే ఆఫర్లు.. ఫ్లిప్‌కార్ట్ జూన్ ఎపిక్ సేల్ సందర్భంగా మోటోరోలా స్మార్ట్‌ఫోన్‌లపై బంపర్ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. పాపులర్ బ్రాండ్ మోటో ఫోన్లను మీ బడ్జెట్ ధరలోనే ఇంటికి తెచ్చుకోవచ్చు. ఈ సేల్‌లో శాంసంగ్, షావోమీ, ఒప్పో, వివో, మోటోరోలా వంటి బ్రాండ్‌ల ఫోన్లపై వేల రూపాయలు తగ్గింపు పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లలో 50MP మెయిన్ కెమెరా, 7000mAh వరకు భారీ బ్యాటరీతో ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ సేల్ సందర్భంగా మోటోరోలా స్మార్ట్‌ఫోన్లలో జీ సిరీస్, ఎడ్జ్ సిరీస్ ఫోన్లు చౌకైన ధరకే లభిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ మోటో ఫోన్లపై బెస్ట్ డీల్స్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ :
ఈ మోటోరోలా ఫోన్ రూ. 27,999కి లిస్ట్ అయింది. బ్యాంక్ ఆఫర్లతో ఇంకా తగ్గింపు పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుతో కొంటే రూ. 1400 డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఫోన్‌లో 6.67 అంగుళాల డిస్‌ప్లే ఉంది. డ్యూయల్ లెన్స్‌తో 50MP ప్రైమరీ కెమెరా, 5500mAh బ్యాటరీ ఉంది.
ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్‌సెట్‌తో వస్తుంది. 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్‌తో మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో ఫోన్ రూ. 29,999 ధరకు లభిస్తుంది. ఈ ఫోన్ అసలు ధరపై కంపెనీ రూ. 7 వేల డిస్కౌంట్ అందిస్తోంది.
అలాగే, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుతో కొంటే అదనంగా రూ. 1500 తగ్గింపు పొందవచ్చు. మీడియాటెక్ డైమన్షిటీ 8350 చిప్‌సెట్, 50MP ట్రిపుల్ కెమెరా ఉంది. 6000mAh బ్యాటరీతో 6.7 అంగుళాల సూపర్ HD+ 1.5K డిస్‌ప్లే అందిస్తుంది.
మోటోరోలా G37 పవర్ ఫోన్ :
ఈ మోటోరోలా G37 పవర్ ఫోన్ 4GB ర్యామ్, 128GB ర్యామ్ వేరియంట్లు రూ. 15,999 ధరకు లభ్యమవుతున్నాయి. కంపెనీ ఈ ఫోన్‌పై సుమారు రూ. 15వేలు డైరెక్ట్ డిస్కౌంట్ అందిస్తోంది. అలాగే, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ద్వారా ఈ ఫోన్ కొనుగోలు చేస్తే అదనంగా రూ. 800 డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఫోన్‌లో 6.6-అంగుళాల డిస్‌ప్లే ఉండగా, డైమెన్సిటీ 6400 చిప్‌సెట్‌తో వస్తుంది. బ్యాక్ సైడ్ 50MP మెయిన్ కెమెరా, భారీ 7000mAh బ్యాటరీ ఆప్షన్ కూడా అందిస్తుంది.










Comments