మున్సిపల్ ఫలితాలు.. భార్యాభర్తలు, తల్లీకొడుకులు విజయాలు
తెలంగాణ : భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీలో భార్యాభర్తలు జయకేతనం ఎగురవేశారు. 13వ వార్డు నుంచి జూపల్లి రమేశ్, 6వ వార్డు నుంచి శశికళ కాంగ్రెస్ కౌన్సిలర్లుగా గెలిచారు. మెదక్ జిల్లా రామాయంపేటలోనూ భార్య లావణ్య (1వ వార్డు), భర్త నాగరాజు (7వ వార్డు) కాంగ్రెస్ తరఫున విజయం సాధించారు. మరోవైపు మెదక్‌లో తల్లీకొడుకులు జయకేతనం ఎగురవేశారు. 17వ వార్డు నుంచి లలిత, 29వ వార్డు నుంచి ఉదయ్ BRS తరఫున గెలిచారు.










Comments