• Jun 25, 2026
  • NPN Log

    అసలే వర్షాకాలం.. వానలు జోరుగా పడుతున్నాయి.. బయటకు వెళ్లే ముందు మీ ఫోన్ జాగ్రత్త.. వర్షంలో ఫోన్ తడిసినా నీళ్లలో పడినా ఫోన్ పనిచేయదు.. అందుకే వర్షంలో తడిసినా కూడా ఫోన్ పనిచేయాలంటే వాటర్ ప్రూఫ్ ఫోన్లు తీసుకోవాల్సిందే.. ప్రస్తుతం మార్కెట్లో అత్యంత సరసమైన ధరలో చాలా వాటర్ ప్రూఫ్ ఫోన్లు లభ్యమవుతున్నాయి. అందులోనూ రూ. 20వేల లోపు ధరలో మంచి స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి.

    ముఖ్యంగా కొన్ని ఫోన్లు అయితే IP67 / IP68 రేటింగ్‌తో వస్తున్నాయి. మీ బడ్జెట్ ధరలో ఫుల్  వాటర్‌ప్రూఫ్ ఫోన్లు కాకపోయినా వర్షం, స్ప్లాష్‌లు, చిన్న నీటి తుంపరలు పడినా ఫోన్ పాడవ్వదు అనమాట. మీరు కూడా కొత్త వాటర్ ప్రూఫ్ కొనాలని చూస్తుంటే ప్రస్తుతం మార్కెట్లో లభించే టాప్ 5 వాటర్ ప్రూఫ్ ఫోన్లను ఓసారి లుక్కేయండి.. ఇందులో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి..

     

     

    1. మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ :
    ఈ మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ సెగ్మెంట్‌లో చాలా పవర్‌ఫుల్ ఫోన్. ఇందులో IP68 రేటింగ్ అందిస్తుంది. వర్షంలోనే కాదు.. నీళ్లలో ఎక్కువసేపు పడినా కూడా తట్టుకోగలదు. బైక్ మీద వెళ్లేటప్పుడు వర్షంలో కాల్స్ మాట్లాడినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఫీచర్ల విషయానికి వస్తే.. 6.6 నుంచి 6.7 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే ఉంటుంది. బ్రైట్‌నెస్ హైగా ఉంటుంది. కలర్ రిచ్ విజువల్స్ బాగుంటాయి.

     

     

     

    120Hz రిఫ్రెష్ రేట్ కారణంగా స్క్రోలింగ్ స్మూత్‌గా అనిపిస్తుంది. పర్ఫార్మెన్స్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. రోజువారీ యాప్స్, మల్టీటాస్కింగ్ చాలా ఈజీగా ఉంటుంది. గేమింగ్ పరంగా చూస్తే మిడియం లెవెల్ అంతే.. మోటోరోలా ఫోన్ క్లీన్ ఆండ్రాయిడ్ కారణంగా బ్లోట్‌వేర్ లేకుండా ఫోన్ ఫాస్ట్ రన్ అవుతుంది.

     

     

    కెమెరా సెటప్ చాలా డీసెంట్‌.. డేలైట్ ఫొటోలు చాలా క్లియర్‌గా వస్తాయి. నైట్ మోడ్ కూడా పర్వాలేదు. బ్యాటరీ ఒక రోజు వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తుంది. ప్రస్తుతం ఈ మోటోరోలా ఫోన్ ధర రూ. 18వేల నుంచి రూ. 20వేల మధ్య ఉంటుంది.

     

     

    2. శాంసంగ్ గెలాక్సీ A35 5జీ :
    శాంసంగ్ గెలాక్సీ A35 5జీ ఫోన్ అద్భుతమైన మిడ్ రేంజ్ ఫోన్. IP67 వాటర్ రెసిస్టెన్స్ అందిస్తుంది. వర్షాలు, స్ప్లాష్‌లు, డస్ట్ నుంచి ప్రొటెక్షన్ అందిస్తుంది. రోజువారీ వాడకానికి ఈ ఫోన్ చాలా సేఫ్ ఫోన్ అని చెప్పొచ్చు. 6.6 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది.

     

     

    ఈ ఫోన్ కలర్ ఆప్షన్లు చాలా బ్రైట్‌గా షార్ప్‌గా ఉంటాయి. 120Hz రిఫ్రెష్ రేట్ కారణంగా స్క్రీన్ చాలా స్మూత్‌గా కనిపిస్తుంది. వర్షంలో కూడా డిస్‌ప్లే విజిబిలిటీ పనిచేస్తుంది. పర్ఫార్మెన్స్ కూడా స్టేబుల్‌గా ఉంటుంది.

     

     

    ఎక్సినోస్ చిప్‌తో సోషల్ మీడియా, యూట్యూబ్, యాప్స్ అన్నీ ఫాస్ట్ రన్ అవుతాయి. హీట్ మేనేజ్‌మెంట్ కూడా పర్వాలేదు. కెమెరా పరంగా చూస్తే 50MP మెయిన్ సెన్సార్‌తో వస్తుంది. డేలైట్ ఫొటోలు అద్భుతంగా వస్తాయి. పోర్ట్రెయిట్ మోడ్ కూడా చాలా క్లియర్ ఉంటుంది. 5000mAh బ్యాటరీ కూడా పెద్దదే.. ఒక రోజు వరకు ఛార్జింగ్ వస్తుంది. ప్రస్తుతం ఈ శాంసంగ్ ఫోన్ ధర రూ. 18వేల నుంచి రూ. 20వేల మధ్య ఉంటుంది.

     

     

    3. గూగుల్ పిక్సెల్ 7a :
    గూగుల్ పిక్సెల్ 7ఎ ఫోన్ చూసేందుకు చాలా చిన్నదైనా పవర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఈ పిక్సెల్ ఫోన్ IP67 రేటింగ్ తో వస్తుంది. వర్షంలో వాడినా సేఫ్ అని చెప్పొచ్చు. కానీ, ఇందులో కెమెరా మాత్రం హైలైట్. ఫీచర్ల విషయానికి వస్తే.. 6.1 ఇంచ్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంటుంది. సైజ్ చిన్నదే అయినా షార్ప్ విజువల్స్ అందిస్తుంది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement