• Apr 01, 2026
  • NPN Log

    చెమట పట్టడం మన శరీరానికి సహజమైన ప్రక్రియ. వ్యాయామం చేసినప్పుడు లేదా వేడి వాతావరణంలో ఉన్నప్పుడు చెమట పట్టడం సాధారణమే. ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే సహజ విధానం. అయితే కొంతమందికి అధికంగా చెమట పడుతుంది. దీనిని నిర్లక్ష్యం చేయకూడదు. కొన్ని సందర్భాల్లో ఇది అంతర్గత ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు. శరీరంలో ఉన్న చెమట గ్రంథులు శరీరాన్ని చల్లగా ఉంచేందుకు చెమటను ఉత్పత్తి చేస్తాయి. కానీ కొన్ని పరిస్థితుల్లో ఈ ప్రక్రియ ఎక్కువగా జరుగుతుంది. కొన్ని ఆరోగ్య సమస్యలు లేదా మందుల వల్ల చెమట ఎక్కువగా పట్టవచ్చు. ఇలాంటి పరిస్థితిని ‘హైపర్ హైడ్రోసిస్’ అంటారు. వేడి లేకపోయినా లేదా శారీరక శ్రమ లేకపోయినా అధికంగా చెమట పడుతుంది. ఇది రోజువారీ పనులకు ఇబ్బంది కలిగించడమే కాకుండా అసౌకర్యంగానూ అనిపిస్తుంది.

    అధిక చెమటకు కారణాలు:

    హార్మోన్ల మార్పులు

    ఒత్తిడి, ఆందోళన

    కొన్ని మందుల ప్రభావం

    థైరాయిడ్ వంటి ఆరోగ్య సమస్యలు

    జన్యుపరమైన కారణాలు

    చెమటను తగ్గించడానికి మొదట ప్రత్యేక లోషన్లు లేదా యాంటీ-పర్స్పిరెంట్లు ఉపయోగిస్తారు. అవి పనిచేయకపోతే మందులు లేదా ఇతర చికిత్సలు అవసరం కావచ్చు. తీవ్రమైన సందర్భాల్లో శస్త్రచికిత్స కూడా సూచించవచ్చు.

    చెమట పడటం వల్ల లాభాలు కూడా ఉన్నాయి:

    చర్మంలోకి చొచ్చుకుపోయిన కాలుష్యం, విషపదార్థాలను చెమట బయటకు పంపుతుంది.

    చెమట పట్టడం వల్ల చర్మ రంధ్రాలు తెరుచుకుని, వాటిలో ఉండే మలినాలు, బ్యాక్టీరియా బయటకు పోయి చర్మం లోపలి నుంచి శుభ్రమవుతుంది. ఇది చర్మానికి తేమను కూడా అందిస్తుంది.

    రక్తప్రసరణ మెరుగై శరీరానికి ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది.

    చెమట పట్టడం సహజమైనదే అయినప్పటికీ, అధికంగా చెమట పడితే దాన్ని నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం మంచిది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement