తిరుమల మాడవీధులకు వేదాల పేర్లు
ఆంధ్ర ప్రదేశ్ : తిరుమలలోని ముఖ్యమైన స్థలాలు, మార్గాలకు ఆధ్యాత్మికత చేకూరేలా పేర్లు పెట్టాలని TTD భావిస్తోంది. ఇందులో భాగంగా శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న 4 మాడవీధులకు 4 వేదాల పేర్లు(రుగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణవేద) పెట్టాలని నిర్ణయించింది. శ్రీవారి దర్శనం తర్వాత భక్తులు రోడ్డుపైకి వచ్చే ప్రాంతానికి శ్రీకృష్ణదేవరాయ మార్గం పేరును పెట్టనుంది. ఇతర మార్గాలకు గరుడాద్రి, పద్మావతి, ఆళ్వార్లు పేర్లను పరిశీలిస్తోంది.









Comments