తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
హైదరాబాద్ : రానున్న మరికొన్ని గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్, మహబూబాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వరంగల్, యాదాద్రి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వర్షం సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఎల్‌నినోపై వాతావరణ శాఖ హెచ్చరిక
ఎల్‌నినోపై భారత వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. పసిఫిక్ మహాసముద్ర ఉపరితలంపై ఎల్‌నినో ఏర్పడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. రుతుపవనాల సీజన్లో ఎల్‌నినో మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని పేర్కొంది. దేశంలో రుతుపవనాలపై ఎల్‌నినో ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపింది. అత్యధిక వర్షపాతం నమోదయ్యే నైరుతి రుతుపవనాల్లో వర్షపాతం తగ్గుతుందని భారత వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రానున్న రోజుల్లో ‘సూపర్ ఎల్‌నినో’ ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.









Comments