ఫిఫా ప్రపంచ కప్ 2026: అమెరికా సంచలన విజయం
ఫిపా ప్రపంచ కప్ 2026లో ఆతిథ్య అమెరికా బోణీ కొట్టింది. పరాగ్వేపై ఆధిపత్యం ప్రదర్శిస్తూ సంచలన విజయాన్ని నమోదు చేసింది. 4-1 తేడాతో పరాగ్వేను యూఎస్ఏ చిత్తు చేసింది. మొదట్నుంచీ దూకుడుగానే ఆడిన అమెరికా.. పరాగ్వేకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఈ క్రమంలో అమెరికా ఓ అరుదైన ఘనత సాధించింది. ఫిఫా ప్రపంచకప్ చరిత్రలోనే ఒక మ్యాచ్‌లో నాలుగు గోల్స్ చేయడం ఇదే ప్రథమం. ఇప్పటివరకు ఆ జట్టు ఎన్నడూ ఈ ఫీట్‌ను సాధించలేదు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆట ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే పరాగ్వేపై అమెరికా ఎదురుదాడి చేసింది. మ్యాచ్ మొదలైన 7వ నిమిషంలోనే డామియన్ గోల్ సాధించి అమెరికాను ఆధిక్యంలో నిలిపాడు. ఆ తర్వాత ఫోలారిన్ వరుసగా రెండు గోల్స్ కొట్టడంతో యూఎస్ఏ దూకుడును పరాగ్వే తట్టుకోలేకపోయింది. దీంతో మ్యాచ్ అర్ధభాగం ముగిసే సమయానికి అమెరికా 3-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండో హాఫ్‌లో 73వ నిమిషం వద్ద పరాగ్వే ఆటగాడు మౌరిసియో గోల్ కొట్టాడు.
దీంతో అమెరికా ఆధిక్యం 3-1కి తగ్గింది. ఆట అదనపు సమయంలో అమెరికా ప్లేయర్ గివోన్ని రీనా గోల్ కొట్టి 4-1 తేడాతో తన జట్టును గెలిపించాడు. పరాగ్వే ఆటగాళ్లు స్కోరు కోసం సర్వశక్తులు ఒడ్డినా.. అమెరికా ముందు నిలువలేకపోయారు. బంతిపై నియంత్రణ పరాగ్వే కంటే అమెరికానే ఎక్కువ చేసింది. అమెరికా జూన్ 20న ఆస్ట్రేలియాతో తలపడనుండగా.. అదే రోజు పరాగ్వే టర్కీతో ఆడనుంది.








Comments