• Apr 01, 2026
  • NPN Log

    దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం పెరగడం, డాలర్ బలహీనపడటంతో అంతర్జాతీయంగా పసిడి ధరలకు రెక్కలొచ్చాయి. ఫలితంగా భారత్‌లో శనివారం 24 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర సగటున రూ.1900 మేర పెరిగింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, ఆదివారం హైదరాబాద్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం స్పాట్ ధర రూ.1,57,750కు చేరుకుంది. నిన్నటి ధరతో పోలిస్తే ఇది రూ.1,970 అధికం. ఇక 22 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర కూడా రూ.1,800ల మేర పెరిగి రూ.1,44,600కు చేరుకుంది. నగరంలో వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం కిలో వెండి రూ.2,80,000 వద్ద తచ్చాడుతోంది.

    అమెరికన్ కరెన్సీ డాలర్ బలహీనపడ్డ నేపథ్యంలో పసిడి, వెండివైపు పెట్టుబడులు మళ్లే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫలితంగా సోమవారం నుంచీ బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. బంగారం, వెండిలపై ఇన్వెస్ట్ చేసే వారు డాలర్ విలువపై ఓ కన్నేసి ఉంచాలని సూచిస్తున్నారు.


    ప్రధాన నగరాల్లో 10 గ్రాముల పసిడి ధరలు (24కే, 22కే)

    చెన్నై: ₹1,58,840; ₹1,45,600

    ముంబై: ₹1,57,750; ₹1,44,600

    న్యూఢిల్లీ: ₹1,57,900; ₹1,44,750

    కోల్‌కతా: ₹1,57,750; ₹1,44,600

    బెంగళూరు: ₹1,57,750; ₹1,44,600

    హైదరాబాద్: ₹1,57,750; ₹1,44,600

    విజయవాడ: ₹1,57,750; ₹1,44,600

    కేరళ: ₹1,57,750; ₹1,44,600

    పుణే: ₹1,57,750; ₹1,44,600

    వడోదరా: ₹1,57,800; ₹1,44,650

    అహ్మదాబాద్: ₹1,57,800; ₹1,44,650

     

    వెండి ధరలు

    చెన్నై: ₹2,80,000

    ముంబై: ₹2,75,000

    న్యూఢిల్లీ: ₹2,75,000

    కోల్‌కతా: ₹2,75,000

    బెంగళూరు: ₹2,75,000

    హైదరాబాద్: ₹2,80,000

    విజయవాడ: ₹2,80,000

    కేరళ: ₹2,80,000

    పుణే: ₹2,75,000

    వడోదరా: ₹2,75,000

    అహ్మదాబాద్: ₹2,75,000

    గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలను తెలుసుకోవాలని సూచన.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement