• Apr 15, 2026
  • NPN Log

    మహారాష్ట్రలో సభ్య సమాజం తలదించుకునేలా.. దారుణం వెలుగులోకి వచ్చింది. సుమారు 180 మంది మైనర్ బాలికలను ప్రేమ పేరుతో వంచించి, వారిపై లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా.. ఆ దృశ్యాలను వీడియో తీసి వేధించిన కిరాతకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. పరాత్వడ నగర నివాసి అయిన మహమ్మద్ అయాజ్ అలియాస్ తన్వీర్ ఫేస్ బుక్, ఇన్‌స్ట్రా‌గ్రామ్, వాట్సాప్, స్నాప్‌చాట్ గ్రూపుల ద్వారా అమాయకపు మైనర్ బాలికలను లక్ష్యంగా చేసుకునేవాడు. వారిని ప్రేమ వలలోకి లాగి, నమ్మకం కుదిరిన తర్వాత ముంబై, పూణే వంటి నగరాలకు తీసుకువెళ్లేవాడు. అక్కడ వారిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడటంతో పాటు, వారి అశ్లీల వీడియోల చిత్రీకరించేవాడు. సుమారు 350 అశ్లీల వీడియోలను చిత్రీకరించినట్లు విచారణలో తేలింది.

    నోరు విప్పితే ఈ వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తూ వారిపై నిరంతరం వేధింపులకు పాల్పడేవాడు. ఈ భయంతో చాలా మంది బాధితులు బయటకు చెప్పలేక నరకయాతన అనుభవించారు. కొంతమందిని బెదిరిస్తూ.. బలవంతంగా వ్యభిచారం చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు, కొన్ని వీడియోలు ఆన్‌లైన్‌లో కూడా షేర్ చేసినట్లు సమాచారం. బాధితుల్లో ఒకరు ధైర్యం చేసి ఫిర్యాదు చేయడంతో ఈ రాకెట్ గుట్టురట్టయింది. ఈ కేసులో వేగంగా స్పందించిన పోలీసులు, అయాజ్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అయాజ్‌కు కోర్టు ఏడు రోజుల పాటు పోలీసు కస్టడీ విధించింది. అతని వద్ద ఉన్న మొబైల్ ఫోన్లు, స్టోరేజ్ డివైజ్‌లను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అందులో ఉన్న వందలాది వీడియోలను చూసి విస్తుపోయారు. అయితే, ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత అతని ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి అలాంటి చాలా వీడియోలు తొలగించినట్లు తెలుస్తోంది. అయాజ్ ఆ వీడియోలను తన స్నేహితులతో పంచుకున్నాడా? లేక ఏదైనా ముఠాతో పంచుకున్నాడా? అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement