రేపు ర్యాపిడో, ఉబర్, ఓలా డ్రైవర్ల సమ్మె
ర్యాపిడో, ఉబర్, ఓలా, పోర్టర్, అంకుల్, మూవర్ డ్రైవర్లు రేపు దేశవ్యాప్తంగా బంద్ పాటించనున్నారు. 6AM-12PM మధ్య సమ్మె కొనసాగనుంది. దీంతో హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో సర్వీసులకు అంతరాయం ఏర్పడనుంది. మినిమమ్ ఫేర్ వల్ల ఆదాయం తగ్గుతోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అగ్రిగేటర్ కంపెనీల తీరుతో దోపిడీకి గురవుతున్నామని చెబుతున్నారు. వీటిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.










Comments