విషాదం.. కారు చక్రాల కింద పడి మూడేళ్ల బాలుడి మృతి
హైదరాబాద్ : నగరంలోని మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. కారు చక్రాల కింద పడి మూడేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఓ ప్రైవేటు కంపెనీకి చెందిన కారు కిందే బాలుడు శివం పడిపోయాడు. తీవ్ర గాయాలయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనతో కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కంపెనీ ముందు ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ కంపెనీ ఎదుట బైఠాయించి బంధువులు, కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు.
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. న్యాయం జరిగేలా చూస్తామంటూ పోలీసులు నచ్చజెప్పడంతో కుటుంబసభ్యలు ఆందోళన విరమించారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.









Comments