• Jul 28, 2026
  • NPN Log

    విశాఖ జిల్లా పెందుర్తి జూలై 27:

    సుజాతనగర్ దగ్గర దాట్ల మెన్షన్ కళ్యాణ మండపంలో విశాఖ శ్రీశయన సంఘ ప్రెసిడెంట్ పెంట వెంకట రమణమూర్తి ఆధ్వర్యంలో వివాహ పరిచయ వేదిక నిర్వహించడం జరిగింది.రాష్ట్రంలో ప్రతి జిల్లా నుండి సుమారుగా 400 కుటుంబాలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర శ్రీ శయన అధ్యక్షుడు కోల బలరాం పాల్గొన్నారు. కమిటీ సభ్యులు ముఖ్య అతిథి చేతుల మీదగా జ్యోతి ప్రజ్వలన చేసి తదనంతరం ముఖ్యఅతిథికి సాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కోలా బలరాం మాట్లాడుతూ శ్రీశైలం విశాఖ జిల్లా అధ్యక్షులు పెంట వెంకటరమణమూర్తి ఆలోచన చాలా అద్భుతమని ప్రస్తుత సమాజంలో కులాల మీద కుల వ్యవస్థల మీద యువతకు అనేక ప్రలోభాలతో ఇబ్బందులు పడుతున్న సమయం సంఘంలోని ఇలాంటి మంచి కార్యక్రమాలను నిర్వహించి కుటుంబ వ్యవస్థను సంఘం భవిష్యత్తు తరాలకు అందించే విధంగా పరిచయ వేదిక నిర్వహించి ప్రజలకు నిత్యం స్వచ్ఛమైన సమాజ పాలనా వ్యవస్థను వ్యవహార శైలిలను నడుచుకోవలసిన విధివిధానాలకు ముఖ్యమైన ఘట్టం వివాహమని తెలపడం చాలా సంతోషకరం ఇలాగే శ్రీశయన సేవా సంఘం విశాఖ జిల్లాలో మరిన్ని పరిచయ వేదికలు నిర్వహించాలని తెలిపారు.వెంకటరమణమూర్తి కమిటీ సభ్యులు మాట్లాడుతూ వివాహ పరిచయము యొక్క ముఖ్య ఉద్దేశం అన్ని జిల్లాలలో ఉన్న శ్రీశయన పెళ్లి కావలసిన వధూవరులు సరైన వేదిక లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి చాలా ఆనందం వ్యక్తం చేయడం జరిగింది.కుటుంబ పెద్దలు తమ పిల్లలకు ఒక సరైన వివాహ సంబంధం చూసుకోవడానికి మాకు ఇది ఎంతో ముఖ్యమైన వేదిక అనే సంతోషం వ్యక్తం చేయడం జరిగింది.ఈ వివాహ పరిచయ వేదిక అనేది ప్రతి సంవత్సరం విశాఖ శ్రీశయన ఆధ్వర్యంలో జరుగుతుంది.ఈ కార్యక్రమంలో విశాఖ శ్రీశయన సంఘ ప్రెసిడెంట్ పెంట వెంకట రమణమూర్తి, ప్రధాన కార్యదర్శి బమ్మిడి రమణ,సంఘ వ్యవస్థాపకులు కిల్లి గోపాలం,రాష్ట్ర శ్రీ శయన అధ్యక్షుడు కోల బలరాం, కోశాధికారి భోగాది వెంకట్,వర్కింగ్ ప్రెసిడెంట్ మాగు బెహరా శోభన్ బాబు,రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మెండ ప్రభావతి,కోల శ్రీరాములు పూతి చంద్రభూషణరావు,రెల్ల శంకరరావు,తడఖా భాస్కరరావు, గెడ్డి తిరుపతిరావు,బొద్దంకి జగన్నాధ రావు,దీర్ఘాసి ఆదినారాయణ,కోట సింహాచలం,దండుపాటి వెంకట్రావు, బొంగు రాజారావు,బోగాది శ్రీనివాసరావు,ముంగి సత్యనారాయణ,గుజ్జల లోకనాథం,దండుపాటి ప్రకాష్ కుమార్,రెల్ల అరుణ,బొద్దంకి శ్రీనివాసరావు,ముప్పిడి లోకేశ్వరరావు,దండుపాటి హరిబాబు,యాగంటి జానకిరామ్,మంగి మాధవరావు,పెరిమాల గణపతి పూతి చంద్రశేఖర్,మెండతవుడు మాస్టర్,వధూవరులు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).