• Jul 28, 2026
  • NPN Log

    ముంబై: గత వారమంతా నష్టాల్లో పయనించిన భారత స్టాక్‌ మార్కెట్‌కు ఊరట లభించింది. ఐదు రోజుల నష్టాలకు తెరిదించిన సూచీలు సోమవారం ట్రేడింగ్‌లో లాభాల బాట పట్టాయి. అమెరికా-ఇరాన్‌ పరస్పర దాడులను తాత్కాలికంగా నిలిపివేయడంతో ముడి చమురు ధరలు భారీగా తగ్గడం ఇందుకు దోహదపడింది. ఒక దశలో 841 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్‌.. చివరికి 776.01 పాయింట్ల (1.02 శాతం) లాభంతో 76,835.78 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 228.50 పాయింట్ల (0.96 శాతం) వృద్ధితో 23,995.95 వద్ద ముగిసింది. ఈక్విటీ మదుపరుల సంపదగా భావించే బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.5.10 లక్షల కోట్లు పెరిగి రూ.480.80 లక్షల కోట్లకు (5 లక్షల కోట్ల డాలర్లు) చేరుకుంది. ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం విలు వ ఏకంగా 54 పైసలు లాభపడి రూ.95.92 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ ముడి చమురు పీపా ధర ఒక దశలో 9.40 శాతం తగ్గి 87.64 డాలర్లకు జారుకుంది.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).