• May 30, 2026
  • NPN Log

    న్యూఢిల్లీ : బీజేపీ నాయకత్వం నాలుగు రాష్ట్రాలకు కొత్త సారథులను నియమించింది. కేంద్ర మంత్రి హర్ష్‌ మల్హోత్రా ఢిల్లీ అధ్యక్షుడయ్యారు. పంజాబ్‌ అధ్యక్షుడిగా సర్దార్‌ కేవల్‌సింగ్‌ ధిల్లాన్‌, హరియాణాకు అర్చనా గుప్తా, త్రిపురకు అభిషేక్‌ దేబ్రాయ్‌లను జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ నియమించినట్లు పార్టీ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. హర్ష్‌ మల్హోత్రా ప్రస్తుతం తూర్పు ఢిల్లీ ఎంపీగా ఉన్నారు. కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాలు, రోడ్డురవాణా, హైవేల శాఖల సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement