ఇరాన్‌తో రెండు రోజుల్లో మరోసారి చర్చలు: ట్రంప్
ఇరాన్-అమెరికా మధ్య మరోసారి శాంతి చర్చలు జరగనున్నాయి. వచ్చే రెండు రోజుల్లో పాకిస్థాన్‌లో చర్చలు ఉంటాయని న్యూయార్క్ పోస్ట్‌తో ట్రంప్ వెల్లడించారు. ఈ విషయంలో పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ చక్కగా పని చేస్తున్నారని ప్రశంసించారు. ఆయన అద్భుతమైన వ్యక్తి అని, అందుకే మరోసారి పాక్‌లోనే చర్చలు జరుపుతామని ప్రకటించారు. కాగా గత ఆదివారం పాకిస్థాన్‌లో జరిగిన తొలి దశ చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే.










Comments