• Jul 28, 2026
  • NPN Log

    ఇరాన్‌తో కొనసాగుతున్న దౌత్య చర్చలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశావహంగా స్పందించారు. అమెరికా, ఇరాన్ వరుసగా మూడో రోజూ పరస్పర దాడులను నిలిపివేయడంతో శాంతి చర్చల్లో పురోగతి సాధించే అవకాశాలు మెరుగుపడ్డాయని ఆయన పేర్కొన్నారు. ఎయిర్ ఫోర్స్ వన్‌లో ట్రంప్ మీడియాతో మాట్లాడారు.

    'ప్రస్తుతం ఇరాన్‌తో మంచి స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. పురోగతి సాధించే మంచి అవకాశం ఉంది. మాకు ఓర్పు ఉంది. ఒకవేళ చర్చలు విఫలమైతే అమెరికా మళ్లీ కఠినమైన సైనిక చర్యలను పునఃప్రారంభించే అవకాశాన్ని కూడా తోసిపుచ్చలేం' అని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ అణు కార్యక్రమం, హోర్ముజ్ జలసంధి భద్రత, ప్రాంతీయ స్థిరత్వం వంటి అంశాలపై ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి.

    మధ్యవర్తి దేశాల సహకారంతో దౌత్య ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ, తుది ఒప్పందానికి చేరుకోవాలంటే ఇంకా పలు కీలక విభేదాలను పరిష్కరించాల్సి ఉందని సమాచారం. కాగా, మూడు రోజులుగా ఇరు దేశాల మధ్య పరస్పర దాడులు జరగడం లేదు. అయినప్పటికీ ఇరాక్, జోర్డాన్, సౌదీ అరేబియా పరిసర ప్రాంతాల్లో డ్రోన్ దాడుల ఘటనలు నమోదవుతున్నాయి.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).