‘నైరుతి’ వర్షాలు!
అమరావతి : దక్షిణ కోస్తాంధ్ర పరిసరాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శుక్రవారం రాయలసీమలో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిశాయి. అన్నమయ్య జిల్లా కలికిరిలో 30.5, నిమ్మనపల్లిలో 29.5, చిత్తూరు జిల్లా పలమనేరులో 24.7, కర్వేటినగరంలో 21 మిల్లీమీటర్ల వాన పడింది. శనివారం మన్యం, అల్లూరి, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గంటకు 40-50కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. నైరుతి ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా శుక్రవా రం సాయంత్రం భీకర గాలులతో వర్షం కురిసింది. హోరు గాలులతో వర్షం పడటంతో భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఈదురుగాలులకు ఆత్మకూరు సచివాలయం సమీపంలో విద్యుత్ స్తంభం కూలిపోయింది.తిరుమలలో శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో నల్లటి మేఘాలు కప్పేశాయి. ఆతర్వాత వర్షం జోరుగా కురిసింది. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన భక్తులు ఇబ్బంది పడ్డారు.










Comments